రేషన్ దుకాణాల్లో తహశీల్దార్ ఆకస్మిక తనిఖీ
KRNL: సి. బెళగల్ మండల కేంద్రంలోని గల 4, 5, 7 రేషన్ దుకాణాలను తహసీల్దార్ వెంకటలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రేషన్ షాపుల రికార్డులను, వచ్చిన నిల్వ ఉన్న స్టాక్‌ను పరిశీలించారు. రేషన్ పంపిణీలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలని ఆమె డీలర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ తరుణ్, వీఆర్వో వెంకటేష్ పాల్గొన్నారు.