మరో భారీ ప్రాజెక్టులో దీపికా పదుకొనె!
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె మరో భారీ ప్రాజెక్టులో భాగం కానున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో దర్శకుడు అమర్ కౌశిక్ 'మహావతార్' సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం దీపికను తీసుకోనున్నట్లు, ఇప్పటికే ఆమెతో మేకర్స్ చర్చలు జరిపినట్లు టాక్. ఆమె పాత్రకు ప్రాధాన్యం ఉంటుందని.. దీపిక ఆ పాత్రకు 100శాతం న్యాయం చేస్తుందని భావిస్తున్నారట.