హనుమాన్ శోభాయాత్రకు ఎమ్మెల్యే ఉగ్రకు ఆహ్వానం

హనుమాన్ శోభాయాత్రకు ఎమ్మెల్యే ఉగ్రకు ఆహ్వానం

ప్రకాశం: కనిగిరి పట్టణంలో ఈనెల 22వ తేదీన జరుగు హనుమాన్ జయంతి శోభాయాత్ర బైక్ ర్యాలీకి హాజరుకావాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని శోభాయాత్ర కమిటీ సభ్యులు కోరారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఉగ్రను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. తప్పకుండా శోభాయాత్ర బైక్ ర్యాలీకి హాజరవుతానని ఎమ్మెల్యే ఉగ్ర వారికి హామీ ఇచ్చారు.