కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
SRD: అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఇళ్ల సాధన సమితి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ధర్నా నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ.. సర్వేనెంబర్ 120, 121, 125 ప్రభుత్వం భూ సేకరణ చేసిందని చెప్పారు. రెండు సంవత్సరాలు గడిచిన ఒకరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదని విమర్శించారు.