పార్క్ స్థలాన్ని కాపాడిన హైడ్రా
మేడ్చల్: అల్వాల్ మండలం మచ్చబొల్లారంలోని సర్వే నంబరు 164లో ఉన్న 520 గజాల పార్క్ స్థలాన్ని హైడ్రా (HYDRAA) అధికారులు కాపాడారు. శ్రీసాయి సూర్య ఫేజ్-2 కాలనీకి చెందిన పార్కు స్థలాన్ని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాలనీవాసులు గురువారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపి, శనివారం ఉదయం పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేయించారు.