ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలి: కమిషనర్
నల్గొండలో ఈనెల 9 నుంచి జరిగే హజరత్ లతీఫ్ షా వలీ ఉర్సు-ఏ-షరీఫ్ ఉత్సవాల ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ SD ముసాబ్ అహ్మద్ మంగళవారం పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందన్నారు. ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూడాలన్నారు.