బైక్ అదుపు తప్పి.. వ్యక్తికి తీవ్ర గాయాలు

బైక్ అదుపు తప్పి..  వ్యక్తికి తీవ్ర గాయాలు

MHBD: డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ శివారులో బుధవారం బైక్ అదుపుతప్పి గూగులోతు సొమ్లా అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పకిరాతండాకు చెందిన సొమ్లా ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించబోయి కింద పడి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆంబులెన్స్ సహాయంతో మహబూబాబాద్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.