VIDEO: హీటర్‌లో మంటలు.. ఇల్లు దగ్ధం

VIDEO: హీటర్‌లో మంటలు.. ఇల్లు దగ్ధం

MDK: రేగోడ్ మండలం టీ.లింగంపల్లిలో సోమవారం విషాదం చోటుచేసుకుంది. డ్వాక్రా సంఘాల VO పూలమ్మ ఇంట్లో స్నానం కోసం ఏర్పాటు చేసిన వాటర్ హీటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు ఇల్లంతా వ్యాపించి, లోపల ఉన్న బియ్యం, బట్టలు, నగదు, విలువైన సామాగ్రిని పూర్తిగా బూడిద చేశాయి. ఈ ప్రమాదంలో సుమారు రూ. 4 నుంచి 5 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితురాలు వాపోయింది.