మార్కండేయ ఆలయంలో హనుమాన్ చాలీసా

SRD: నారాయణఖేడ్ పట్టణం శివారులోని శ్రీ భక్త మార్కండేయ మహాదేవ ఆలయంలో బుధవారం రాత్రి 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఇటీవలే కొత్తగా నిర్మించిన ఈ ఆలయం ప్రారంభోత్సవం నుండి ప్రతి బుధవారం రాత్రి పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణం, భక్తి గీతాలు, భజనలు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించారు.