అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
KDP: వేంపల్లె ICDS ప్రాజెక్ట్ పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు CDPO సునీత తెలిపారు. కాపువీధి, రామిరెడ్డిపల్లి -1, 2 అంగన్వాడీ కార్యకర్తల పోస్టులు, ముత్తుకూరు, నందిపల్లి కేంద్రాల్లో సహాయకురాళ్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఏప్రిల్ 13వ తేదీలోపు ICDS కార్యాలయంలో అందజేయాలన్నారు.