VIDEO: నరసింహ స్వామిని దర్శించుకున్న ఎంపీ
NDL: బేతంచర్ల మండల పరిధిలోని వైష్ణవ పుణ్యక్షేత్రమైన మద్దిలేటి నరసింహ స్వామిని కర్నూలు ఎంపీ నాగరాజు, దంపతులు శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ ఉప కమిషనర్, ఈవో రామాంజనేయులు వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వారికి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం అందజేసి సత్కరించారు.