VIDEO: ముఖ హాజరు సమస్యతో ఇబ్బందులు
ASR: ఉపాధి హామీ పనుల్లో గిరిజన వేతనదారులు ముఖ హాజరు వలన ఇబ్బందులు పడుతున్నారు. జీకేవీధి మండలం అమ్మవారి దారకొండ గ్రామానికి చెందిన కార్మికులు ఉదయం హాజరు నమోదు అయినా మధ్యాహ్నం నమోదు కాకపోవడం సమస్యగా మరిందంటున్నారు. కొండ ప్రాంతాల్లో నెట్ లేక గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. పనులు చేసినా వేతనాలు రావడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.