VIDEO: రోడ్డుపై మంచం వేసుకుని యువకుడి నిరసన
NLR: సైదాపురంలో రోడ్లు సరిగా లేవని ఓ యువకుడు నిరసన చేపట్టాడు. అధికారులు రోడ్డు పనులు సగంలో ఆపేశారని ఆరోపిస్తూ.. రోడ్డుపై మంచం వేసుకుని కూర్చున్నాడు. రోడ్డు వేయాలని స్థానిక ఎమ్మెల్యే, అధికారులను డిమాండ్ చేశాడు. లేని పక్షంలో గ్రామస్థులంతా కలిసి చందాలు వసూలు చేసుకుని స్వయంగా రోడ్డు వేసుకుంటామని పేర్కొన్నాడు.