VIDEO: దట్టంగా కురుస్తున్న పొగమంచు

VIDEO: దట్టంగా కురుస్తున్న పొగమంచు

ASR: కొయ్యూరు మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. రాత్రి వేళల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉదయం 9 గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. పసుపు రంగులో ఉన్న వరి పంట పొలాలు, పొలాల గట్ల మీద పచ్చని చెట్ల నడుమ పొగమంచు అందాలు ప్రకృతి ప్రేమికులను ఆకర్షిస్తున్నాయి. ఓవైపు చలి, మరోవైపు దట్టంగా పొగమంచు కలగలిపిన సహజ సిద్ధ సుందర వాతావరణం మన్యంలో నెలకొంది.