సీఎంతో భూపేష్ రెడ్డి భేటీ

KDP: విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడును టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ భూపేష్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిలు గురువారం కలిశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో 'సుపరిపాలన తొలి అడుగు' కార్యక్రమానికి లభిస్తున్న స్పందన గురించి ఆయనకు వివరించారు. ఆగస్టు నెల మొదటి వారంలో జమ్మలమడుగు పర్యటనకు సీఎంను ఆహ్వానించినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.