రోడ్డు ఇలా.. ప్రయాణించేది ఎలా...?

రోడ్డు ఇలా.. ప్రయాణించేది ఎలా...?

NLG: నకిరేకల్ పట్టణం నుండి నకిరేకల్-తానంచర్ల అడ్డరోడ్డు వరకు రోడ్డు అధ్వానంగా మారింది. నిత్యం ఈ రోడ్డు పైనుండి శాలిగౌరారం, మోత్కూర్, జాజిరెడ్డిగూడెం, అడ్డగూడూర్, వలిగొండ మండలాల్లోని ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. అలాంటి ఈ రోడ్డు సింగల్ లైన్‌గా ఉండడంతోపాటు రోడ్డు మొత్తం ధ్వంసం కావడంతో వాహనాలు వెళ్లేటప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధికారులు సమస్యను తీర్చాలన్నారు.