శ్రీకాళహస్తిలో లారీ దొంగ అరెస్ట్

శ్రీకాళహస్తిలో లారీ దొంగ అరెస్ట్

TPT: శ్రీకాళహస్తి టూ టౌన్ పోలీసులు లారీ దొంగతనం కేసులో నిందితుడైన క్లీనర్ జయచంద్రను గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 7న బసవయ్యపాలెం వద్ద పార్క్ చేసిన ఏపీ 03 టీఈ 9833 నంబర్ లారీని జయచంద్ర తస్కరించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కన్నలి ఎస్టి కాలనీ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను సీఐ నాగార్జున రెడ్డి వెల్లడించారు.