భార్య కాపురం రాకపోవడంతో యువకుడి ఆత్మహత్య

భార్య కాపురం రాకపోవడంతో యువకుడి ఆత్మహత్య

BHPL: జిల్లా కేంద్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. లక్ష్మీనగర్ కాలనీ చెందిన గుడికందుల సతీష్ భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపానికి గురై మంగళవారం అర్ధరాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం గమనించిన మృతుడి సోదరుడు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.