ఎన్టీఆర్ పెన్షన్ పథకం వృద్ధులకు వరం

ఎన్టీఆర్ పెన్షన్ పథకం వృద్ధులకు వరం

KRNL: ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం అవ్వాతాతలకు వరంలాంటిదని టీడీపీ మండల అధ్యక్షులు గవిగట్టు మల్లికార్జున, సొసైటీ ఛైర్మన్ కందనాతి నరసప్ప, టీడీపీ నాయకులు ఏక్ హనుమంతు స్పష్టం చేశారు. ఇవాళ పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు క్రమం తప్పకుండా పింఛన్లు అందజేస్తున్నారన్నారు.