లింక్ క్లిక్.. సినిమా స్టైల్‌లో నగదు మాయం

లింక్ క్లిక్.. సినిమా స్టైల్‌లో నగదు మాయం

WG: భీమవరంలోని శివరావుపేటకు చెందిన శ్రీరామదాసు సైబర్ మోసానికి గురయ్యాడు. ఫోన్‌కు వచ్చిన లింక్‌పై క్లిక్ చేయడంతో బ్యాంక్ అకౌంట్ నుంచి సినిమాలో చూపించే తరహాలో రూ. 1,70,400 ఐదు దఫాలుగా వెంట వెంటనే కట్ అయిపోయాయి. దీంతో బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ నంబర్ 1930కు ఫిర్యాదు చేశాడు. భీమవరం టూటౌన్ సీఐ కాళీచరణ్ అకౌంట్లలో ఉన్న రూ. 90 వేలు ఫ్రీజ్ చేయించారు.