బెట్టింగ్ యాప్ నిర్వాహకులు అరెస్ట్
KDP: పొద్దుటూరు పోలీసులు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేశారు. పొద్దుటూరు మండలం లింగాపురానికి చెందిన ధనికల వీరశంకర్, కాశినాయన మండలానికి చెందిన ఆర్ల చంద్ర యాదవులను DSP భావన, సీఐ సదాశివయ్య ఆధ్వర్యంలో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 10.56 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.