మనిషి ఆత్మ 13 రోజులు ఏం చేస్తుందంటే?
మానవుడు చనిపోయిన తర్వాత అతని ఆత్మ 13 రోజుల పాటు తన కుటుంబ సభ్యుల మధ్యే తిరుగుతూ ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. కుటుంబీకుల ఏడుపు, బాధను గమనిస్తుందట. కానీ వారితో మాట్లాడలేక, తాకలేక ఓ విధమైన వేదనకు గురవుతుందట. ఈ 13 రోజుల్లో పెట్టే పిండం ఆత్మకు ఆహారంగా మారుతుందని నమ్ముతారు. ఈ కర్మకాండల ద్వారా ఆత్మ అంతిమ వీడ్కోలు పలుకుతుందట.