చందుపట్లలో విద్యుత్ షాక్‌తో రైతు మృతి
నల్గొండ: నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామ పరిధిలోని కొత్తవారిగూడెంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ వద్ద రిపేర్ పనులు నిర్వహిస్తున్న రైతు షాబాదు రామ్ రెడ్డి (65)కి అకస్మాత్తుగా విద్యుత్ షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు తెలిపారు.