హౌసింగ్‌లో 100 శాతం సర్వే పూర్తి చేయాలి: ఎమ్మెల్యే
NLR: కోవూరు నియోజకవర్గంలో అధికారులు సమన్వయంతో పనిచేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం, ఇళ్ల నిర్మాణాలకు సర్వే పూర్తి చేయాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. సోమవారం నెల్లూరు నగరంలోని వీపీఆర్ నివాసంలో హౌసింగ్, ఎంపీడీవోలతో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇప్పటివరకు సర్వే వివరాలపై ఆమె ఆరా తీశారు.