VIDEO: పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షం
KKD: కోటనందూరు మండలంలోని పలు గ్రామాల్లో ఇవాళ సాయంత్రం ఉన్నట్లుండి ఒక్కసారిగా వర్షం కురిసింది. ఉదయం నుంచి దంచి కొట్టిన ఎండతో ప్రజలు ఉక్కిరిబక్కిరి కాగా, సాయంత్రానికి వాతావరణం మారి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఉక్కపోత నుంచి ప్రజలకు కొంతవరకు ఉపశమనం లభించింది. మరో వైపు రైతులకు కూడా ఈ వర్షం ఉపయోగకరమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.