రోహిత్, కోహ్లీ వన్డే ప్రపంచకప్ ఆడాలి: మాజీ క్రికెటర్

టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, కోహ్లీపై న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ రాస్ టేలర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారిద్దరూ ఇప్పటికీ చాలా ఫిట్‌గానే కనిపిస్తున్నారని అన్నాడు. 2027 వన్డే ప్రపంచకప్‌లో కచ్చితంగా రోహిత్, కోహ్లీ ఆడాలని తెలిపాడు. అలాగే, తాను IPLలో RCB తరఫున ఆడిన సమయంలో కోహ్లీ 18 ఏళ్ల యువకుడని చెప్పుకొచ్చాడు.