చవితి ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం

సత్యసాయి: కదిరి RDO కార్యాలయం సమావేశ మందిరంలో వినాయక చవితి శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, ఆర్డీవో వీవీఎస్ శర్మ, డీఎస్పీ శివనారాయణ, మున్సిపల్ కమిషనర్ కిరణ్‌కుమార్, తహసీల్దార్ మురళీకృష్ణ, ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. శాంతియుతంగా ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లపై చర్చించారు.