గెలుపే లక్ష్యంగా.. నిండు గర్భిణీ ప్రచారం
BDK: దుమ్ముగూడెం(M) కొత్త దంతెనానికి చెందిన నాగమణి అనే నిండు గర్భిణీ మహిళ వార్డు సభ్యురాలిగా గెలవాలని జోరుగా ప్రచారం సాగిస్తోంది. ప్రసవానికి పట్టుమని పది రోజులు కూడా లేకపోయినా, ఆమె ఎన్నికల్లో గెలవాలనే పట్టుదలతో ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల గురించి వివరిస్తూ.. వాటి వలన కలిగే ప్రయోజనాలను ఓటర్లకు తెలుపుతూ.. గెలుపే లక్ష్యంగా అలసట లేకుండా ప్రచారం చేస్తోంది.