బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ విద్యార్థుల ప్రతిభ

బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ విద్యార్థుల ప్రతిభ

కోనసీమ: కాకినాడలో జరిగిన అండర్-19 అమరావతి ఛాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. బాలుర సింగిల్స్ విభాగంలో మలికిపురానికి చెందిన నందకిషోర్ విజేతగా, కృష్ణ కార్తీక్ రన్నరప్‌గా నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో అమలాపురానికి చెందిన ఆదిత్యరామ్, మలికిపురానికి చెందిన గౌతమ్ విజేతలుగా నిలిచారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.