మావోయిస్టు మాజీ నేత జీవనోపాధి కోసం కలెక్టర్‌కు వినతి

JGL: మావోయిస్టు మాజీ కార్యదర్శి వసంతక్క కోరుట్ల కాంగ్రెస్ ఇంచార్జి జువ్వాడి నర్సింగరావుతో కలిసి మంగళవారం జగిత్యాల సమీకృత కలెక్టరేట్లో కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. జీవనోపాధికి సహాయం, కుమార్తెకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని కోరారు. ఛత్తీస్గఢ్ కంకేర్ జిల్లా బస్తార్ డివిజన్‌లో మావోయిస్టుగా పనిచేసిన వసంతక్క స్వస్థలమైన కోరుట్లకు వచ్చి నివాసముంటున్నారు.