ఏడుగురు జూదరులపై కేసు నమోదు

ఏడుగురు జూదరులపై కేసు నమోదు

KDP: వీరాపునాయునిపల్లి(మం) అనిమేల గ్రామ సమీపంలోని సంగమేశ్వర స్వామి దేవాలయానికి తూర్పువైపున కంప చెట్లలో పేకాట ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. మొత్తం ఏడుగురిలో ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.7,400 నగదును స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. మిగిలిన నలుగురు పరారయ్యారని, వారిపై కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.