శ్రీశైల జలాశయం నుంచి 3, 242 క్యూసెక్కుల నీటి విడుదల

NDL: శ్రీశైలం జలాశయం నుంచి మంగళవారం ఉదయం 6 గంటల సమయానికి 3242 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇందులో తెలంగాణ పరిధిలోని మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2400 క్యూసెక్కులు, ఏపీలోని ముచ్చమర్రి ఎత్తిపోతల పథకానికి 490 క్యూసెక్కులతో పాటు నీటి ఆవిరి రూపంలో 352 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నట్లు ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు.