ఆంధ్ర కేసరికి జిల్లా ఎస్పీ నివాళి

ఆంధ్ర కేసరికి జిల్లా ఎస్పీ నివాళి

ELR: ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయంలో “ఆంధ్ర కేసరి” టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రకాశం పంతులు స్వాతంత్ర సమరయోధుడు, న్యాయవాది, రాజకీయవేత్తగా దేశానికి విశేష సేవలందించారన్నారు. అలాగే 1946–47లో మద్రాస్ ముఖ్యమంత్రిగా సేవలందించారన్నారు.