KGBVలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
VZM: తుమ్మికాపల్లి వద్ద ఉన్న కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయంలో 6వ తరగతి నుంచి 11వ తరగతి ప్రవేశాలకు ఈనెల 12 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ కే. విజయకుమారి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తామని చెప్పారు. ఏప్రిల్ 1 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉందన్నారు.