హత్య కేసులో నలుగురు అరెస్ట్

WGL: నర్సంపేటలో నాలుగు రోజుల క్రితం జరిగిన హత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. ప్రవీణ్, రాజు, పవన్, శివ అనే నలుగురి యువకులు మద్యానికి బానిసయ్యారు. ఇందిరమ్మ కాలనీలో కిరాణా షాపు యజమాని రహీమ్ ఇంట్లో ఒక్కడే ఉన్న విషయం తెలుసుకున్న నలుగురు.. దాడి చేసి హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో వేశారని సీఐ రమణ మూర్తి తెలిపారు.