'పన్నులు సకాలంలో చెల్లించాలి'
ప్రకాశం: ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చి 15 నాటికి 100 శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకొని, బేస్తవారిపేట ఎంపీడీవో రంగనాయకులు బుధవారం ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇంటి పన్ను వసూళ్ల స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మండలంలోని సలకలవీడు గ్రామ పంచాయతీని సందర్శించారు. గ్రామస్థులను వ్యక్తిగతంగా కలిసి ఇంటి పన్నులు చెల్లించాలని అవగాహన కల్పించారు.