CMRF చెక్కులు పంపిణి చేసిన సీపీఐ నాయకులు
KMM: ఎదులాపురం మున్సిపాలిటీలోని లబ్ధిదారులకు మంజూరైన రూ.55,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. గణపారపు అచ్చులు 40,000 బొడ్డు పుల్లమ్మకు 15,000 చెక్కులను అందించారు. అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న పేదలకు ఈ ఆర్థిక సాయం ఎంతో ఊరటనిస్తుందని నాయకులు పేర్కొన్నారు.