VIDEO: చిన్నపాటి వర్షానికే రోడ్లపై మురుగునీరు

SKLM: నగరంలోని రోడ్లు అద్వానంగా తయారవుతున్నాయి. చిన్నపాటి వర్షానికే రోడ్లపై వర్షపు మురుగునీరు నిలిచిపోతోంది. నగరంలోని బైపాస్ నుంచి గుజరాతిపేట వరకు చిన్నపాటి వర్షం పడినా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు గుజరాతిపేట ప్రాంతంలోని డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో రోడ్లపై మురుగునీరు నిలిచిపోతోంది.