సెల్ ఫోన్ లాక్కెళ్ళిన దొంగలు

సెల్ ఫోన్ లాక్కెళ్ళిన దొంగలు

కోనసీమ: ముమ్మిడివరం కొండలమ్మ చింత బైపాస్ రోడ్డు వద్ద ఒక వ్యక్తి దగ్గర నుండి దొంగలు సెల్ ఫోన్ లాక్కెళ్ళిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే కాకినాడకు చెందిన కాట్నం వెంకట్రావు నుంచి ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి కింద పడిపోతున్నట్లు నటించి వెంకటేశ్వరరావు జేబులోంచి సెల్ ఫోన్‌ను అపహరించారు. బాధితుడు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.