'పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి'
KMR: ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పీహెచ్‌సీ వైద్యాధికారి హేమీమా సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలో 'ఫ్రైడే-డ్రై డే' నిర్వహించారు. నిల్వ ఉన్న నీటిని తొలగించి ప్రజలకు అవగాహన కల్పించారు. నీటి నిల్వల వల్ల దోమలు వ్యాపించి రోగాలు వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.