VIDEO: ముదిగుబ్బలో సర్పాల సయ్యాట

సత్యసాయి: ముదిగుబ్బ మండలం రాళ్ల అనంతపురం క్రాస్ సమీపంలో బుధవారం ఉదయం రెండు సర్పాలు సయ్యాటలాడాయి. గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలాల్లో సుమారు 8 అడుగుల పొడవైన పాములు పెనవేసుకుని తన్మయంతో ఊగిసలాడాయి. సుమారు అరగంట పాటు సాగిన ఈ దృశ్యాన్ని చూపరులు ఆసక్తిగా తిలకించారు.