పాఠశాల భవనం లేక విద్యార్థుల కష్టాలు
ASR: డుంబ్రిగుడ మండలం గసభ పంచాయతీ పరిధిలోని జంగిడివలసలో పాఠశాల భవనం లేక విద్యార్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గ్రామంలోని రచ్చబండ(ప్రజవేధిక) షెడ్డులోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు తమ పిల్లల భవష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాలకులు అధికారులు స్పందించి పాఠశాల భవనం నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.