శ్రీశైలంలో ముగిసిన శివ చతుస్సప్తాహ భజనలు

NDL: లోక కళ్యాణం కోసం శ్రీశైలం దేవస్థానంలో నిర్వహించిన శివ చతుస్సప్తాహ భజనలు ఆదివారం ముగిశాయి. శ్రావణ మాసంలో నెలరోజులపాటు శ్రీశైలం దేవస్థానం ప్రాంగణంలో భజనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆలయ ప్రాంగణంలో ఉన్న వీరశిరో మండపంలో కార్యక్రమం చేపట్టారు. కర్నూలు నగరంతో పాటు కర్ణాటక రాష్ట్రానికి చెందిన భజన బృందాల సభ్యులు పాల్గొన్నారు.