VIDEO: బాలికపై అత్యాచారం.. చెత్త ఆటోలో మృతదేహం
అన్నమయ్య: మదనపల్లిలో రేపిస్ట్ కులవర్ధన్ మృతదేహాన్ని తీసుకునేందుకు తల్లిదండ్రులు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో మున్సిపల్ సిబ్బంది అతడి డెడ్ బాడీని ఖననం చేశారు. చెత్తను తీసుకెళ్లే ఆటోలో మృతదేహాన్ని స్మశానానికి తరలించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే కామాంధుల శవాలు చెత్తతో సమానం అనడానికి ఇదే మంచి ఉదాహరణ అని నెటిజెన్లు అంటున్నారు.