నేడు కాకినాడలో జాబ్ మేళా
KKD: జిల్లా ఉపాధి కార్యాలయంలో ఇవాళ 62 ఉద్యోగాలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి జీ.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఫోన్ పే, రామకృష్ణ ఎలక్ట్రికల్ వర్క్స్ వంటి సంస్థలలో పనిచేసేందుకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందన్నారు. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉన్న టెన్త్ నుంచి డిగ్రీ చదివినవారు ఉదయం 10 గంటలకు హాజరు కావాలన్నారు