ఫిబ్రవరి 12న దేశవ్యాప్త కార్మిక సమ్మె
VSP: లేబర్ కోడ్స్ రద్దు, హైర్ అండ్ ఫైర్ విధానం ఉపసంహరణ ఇతర డిమాండ్ల కోసం ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు సమ్మెకు పిలుపునిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర నాయకుడు మరుపిళ్ల పైడిరాజు తెలిపారు. ఆదివారం మధురవాడలో ముఠా కార్మికులు సమావేశం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం.మన్మధరావు, సీపీఐ నేతలు పాల్గొన్నారు.