కొనసాగుతున్న కాంట్రాక్ట్ కార్మికుల రిలే నిరాహార దీక్ష
BDK: భద్రాచలం ఐటీసీ పీఎస్‌పీడీ కాంట్రాక్ట్ కార్మికుల జేఏసీ రిలే నిరాహార దీక్ష ఇవాల్టితో రెండవ రోజుకు చేరుకుంది. దీక్ష చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు సంఘీభావంగా బీఆర్‌టీయు యూనియన్ జిల్లా అధ్యక్షులు, ఐటీసీ యూనియన్ అధ్యక్షులు శానికొమ్ము శంకర్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. కార్మికుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు.