దొంగతనం కేసులో మహిళ అరెస్ట్

దొంగతనం కేసులో మహిళ అరెస్ట్

HNK: సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నక్కలగుట్ట వద్ద వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన పెరుగు సుమశ్రీని అదుపులోకి తీసుకుని విచారించారు. అక్టోబర్ 2024లో ఓ ఇంట్లో చొరబడి నగదు, బంగారం దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. ఆమె వద్ద నుంచి సుమారు 6 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నట్లు CI రంజిత్ కుమార్ తెలిపారు.