విద్యార్థులకు సైకిల్స్ పంపిణీ
HNK: చదువు మన తలరాతను మారుస్తుందని వేలేరు సర్పంచ్ యాదగిరి అన్నారు. వేలేరు జిల్లా పరిషత్ పాఠశాలలో 6వ తరగతి నుంచి 9వ తరగతి చదువుతున్న క్లాస్ టాపర్స్ బాలికలకు SBI సీఎస్ఆర్ ఫండ్స్‌తో సైకిల్స్, ఇతర వస్తువులతో కూడిన కిట్లను సర్పంచ్, ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ కుమారస్వామి అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్య, ఉపాధ్యాయులు ఉన్నారు.