తిరుపతి జిల్లా ఎస్పీని కలిసిన గూడూరు ఎమ్మెల్యే

తిరుపతి జిల్లా ఎస్పీని కలిసిన గూడూరు ఎమ్మెల్యే

TPT: తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడుని శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవలే తిరుపతి జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఎమ్మెల్యే పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గూడూరు నియోజకవర్గంలో నేరాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఎమ్మెల్యే కోరారు.